న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నవంబర్ 1న ప్రతిపక్ష ఇండీ కూటమి తలపెట్టిన ఓట్ బచావో మెగా ర్యాలీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఓటు హక్కు ముప్పులో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం సరికాదని దీదీ పేర్కొన్నారు.
ఓట్ చోరీ, ఎన్నికల సంఘంలో జరుగుతోన్న అవకతవకలకు వ్యతిరేకంగా నవంబర్ 1న రాంలీలా మైదాన్‌లో ఇండీ కూటమి ఐక్యంగా నిలబడుతుందన్నారు. ఇది ఓట్ చోరీ, ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడటానికి చేసే పోరాటమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతోన్న ఓట్ చోరీపై మౌనం వీడి సమాధానాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌ల పరిశీలన, ఓటర్ల డేటా, ఓటర్ల జాబితాలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై దీదీ ఆందోళన వ్యక్తం చేశారు. మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, పౌర సమాజం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని దీదీ పిలుపునిచ్చారు.
