అనన్య శర్మ, ఎస్ కృష్ణ, పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘హై’. దర్శకుడు అనిల్ రావిపూడితో పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు కో-రైటర్‌గా వర్క్ చేసిన ఎస్ కృష్ణ ఈ చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.
నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. ప్రతి వ్యక్తి తన జీవితంలో కోరుకునే ఆనందం, ఉత్సాహం వెనుక ఉన్న భావోద్వేగ, మానసిక, నైతిక సంఘర్షణలను ఆవిష్కరించేలా ఈ సినిమా ఉంటుందని, జెన్ జీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెల, ఎస్ కృష్ణ నిర్మిస్తున్నారు. వికాస్ బడిసా సంగీతం అందిస్తున్నారు.
