మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’. డిసెంబర్ 18న ఇది విడుదల కానుంది. అయితే అమెరికా కంటే ఒక రోజు ముందుగానే, డిసెంబర్ 17న భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రీమియం ఫార్మాట్లతో పాటు ఇన్ఫినిటీ విజన్ ఫార్మాట్‌లోనూ ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇక లీడ్ రోల్స్ నటించిన రాబర్ట్ డౌనీ జూనియర్ (డాక్టర్ డూమ్), క్రిస్ ఎవాన్స్ (స్టీవ్ రోజర్స్) వీడియో ద్వారా ఇండియన్ ఫ్యాన్స్‌కు దీపావళి విషెస్ చెప్పారు. ఆంథోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, టామ్ హిడిల్‌స్టన్, పాట్రిక్ స్టీవర్ట్ తదితరులు నటించారు. అమెరికా కంటే ముందే భారత్‌లో రిలీజ్ చేస్తుండటంతో మార్వెల్ సినిమాల అభిమానులు ఆనందపడుతున్నారు.
