మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతయ్.. నోరుపారేసుకున్న సిద్దిపేట తహసీల్దార్ 

మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతయ్.. నోరుపారేసుకున్న సిద్దిపేట తహసీల్దార్ 

సిద్దిపేట: ఇంటి నిర్మాణానికి అనుమతుల  కోసం  ప్రశ్నించిన ఓ వ్యక్తితో సిద్దిపేట రూరల్ తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ నోరు పారేసుకున్నారు. మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి” అంటూ  వ్యాఖ్యానించాడు. ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మాడంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.

బండచర్లపల్లికి చెందిన రంజిత్ కుమార్ తన గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి సంబంధించిన అనుమతుల విషయమై తహసీల్దార్‌ను ప్రశ్నించాడు.. ఈ సందర్భంగా తనతో తహసీల్దార్ దురుసుగా మాట్లాడారని, బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేశారని రంజిత్ కుమార్ ఆరోపించాడు.ఇంటి నిర్మాణానికి సుడా (SUDA) అధికారులు అనుమతులు ఇస్తున్నారని తాను వివరించినప్పటికీ, తహసీల్దార్ స్పందించిన తీరు తనను ఇబ్బందికి గురిచేసిందన్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో “మంగనిలో పెట్టి తిప్పితే అన్నీ సెట్ అవుతాయి” అంటూ తహసీల్దార్ వ్యాఖ్యానించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల వ్యవహారశైలిపై చర్చ మొదలైంది.

ఈ ఘటనపై బాధితుడు రంజిత్ కుమార్ స్పందిస్తూ, తహసీల్దార్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను జిల్లా కలెక్టర్‌కు వాట్సాప్ ద్వారా పంపి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించాడు.