ఇండియా కూటమి ర్యాలీకి సీజేపీ మద్దతు

 ఇండియా కూటమి ర్యాలీకి  సీజేపీ మద్దతు

న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టనున్న ర్యాలీకి కాక్రోచ్‌‌‌‌‌‌‌‌ జనతా పార్టీ (సీజేపీ) మద్దతు తెలిపింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌‌‌‌‌‌‌‌ దీప్కే బుధవారం ఈ మేరకు ప్రకటించారు.
 
నవంబర్‌‌‌‌‌‌‌‌ 1న ఢిల్లీలోని రామ్‌‌‌‌‌‌‌‌లీలా మైదాన్‌‌‌‌‌‌‌‌లో ఈ ర్యాలీ జరగనుంది. కాగా, ర్యాలీలో రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ సహా ఇండియా కూటమి నాయకులతో కలిసి వేదిక పంచుకుంటారా అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ‘జ్ఞానూ మస్ట్‌‌‌‌‌‌‌‌ గో.. ఇండియా కూటమి ర్యాలీకి కాక్రోచ్‌‌‌‌‌‌‌‌ జనతా పార్టీ మద్దతిస్తోంది. 

దేశమే అన్నింటికంటే ముఖ్యం’ అంటూ అభిజీత్‌‌‌‌‌‌‌‌ దీప్కే ఎక్స్‌‌‌‌‌‌‌‌లో పోస్టు చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించగలరనే నమ్మకాన్ని కోల్పోయారని సీజేపీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.