వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్ఓ) కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
మొత్తం ఖాళీలు: 12.
విభాగాల వారీగా ఖాళీలు: ఆయూష్ డాక్టర్ (పీజీ అర్హతతో) 1, ఆయూష్ మెడికల్ ఆఫీసర్ 4, డైటీషియన్ 1, యోగా ప్రొఫెషనల్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, మల్టీ పర్సస్ వర్కర్ (ఎంపీడబ్ల్యూ) 4.
విద్యార్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద, యునాని, హోమియోపతి లేదా నేచురోపతి విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
బీఏఎంఎస్/ బీయూఎంఎస్/ బీహెచ్ఎంఎస్/ బీఎన్‌వైఎస్ పూర్తిచేసి ఉండాలి. ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
బీఎస్సీ న్యూట్రిషన్ పూర్తిచేసి ఉండాలి.
మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పూర్తిచేసి ఉండాలి.
నేచురోపతి సిస్టమ్‌లో డిగ్రీ కలిగి ఉండాలి. ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సైకిల్/ మోటార్ సైకిల్ నడప కలిగే సామర్థ్యం ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. బీసీ, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 26.
లాస్ట్ డేట్: అక్టోబర్ 31.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, వయసు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్mulugu.telangana.gov.inను సందర్శించండి.
