- దరఖాస్తుకు రేపటి నుంచి నవంబర్ 27 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగులకు టీజీపీఎస్సీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో జోనల్ క్యాడర్ పరిధిలోని 102 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్(ఎంపీఎస్వో), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎస్వో) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ రిలీజ్చేసింది. ఈ నెల 30 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు https://www.tgpsc.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఎంపికైన వారికి నెలకు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు వేతనం ఉంటుందని కమిషన్ కార్యదర్శి హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేసిన వారితోపాటు మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో డిగ్రీ చేసి, స్టాటిస్టిక్స్ను ఒక పేపర్‌గా చదివినవారు అర్హులన్నారు. తదితర వివరాల కోసం కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
