బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలే కదా..గెలిచిన సీట్లెన్ని?..ఎమ్మెల్సీ ఫలితాలపై మోదీ సెటైర్ ..ధీటుగా బదులిచ్చిన కాంగ్రెస్

బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలే కదా..గెలిచిన సీట్లెన్ని?..ఎమ్మెల్సీ ఫలితాలపై మోదీ సెటైర్ ..ధీటుగా బదులిచ్చిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: ‘నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ స్థానాలకు బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ పేపర్లతో పోలింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. మరి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఎన్ని సీట్లు గెలిచిందో చెప్పండి?’ అంటూ కాంగ్రెస్​పై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్​ వేశారు. 
ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర, బిహార్‌‌‌‌‌‌‌‌, కర్నాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఒక్క స్థానంలోనూ ఎందుకు గెలవలేదని ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో ప్రశ్నించారు. 

ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎన్నికలను బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ పేపర్లతో నిర్వహించాలన్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  అయితే, ప్రధానికి కాంగ్రెస్ పార్టీ దీటుగా బదులిచ్చింది. ఫలితాలపై ఈవీఎంల ప్రభావంలేదని అంత నమ్మకం ఉంటే, లోక్‌సభ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని మోదీకి సవాల్​ విసిరింది.