కిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్విస్ట్ చెబితే రూ. కోటి

కిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్విస్ట్ చెబితే రూ. కోటి

జ్యోతి పూర్వజ్, పూర్వజ్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న చిత్రం ‘కిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. పూర్వజ్ దర్శకత్వం వహించడంతో పాటు ఎ.పద్మనాభ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నారు. ఈనెల 30న విడుదల కానుంది. సినిమా  ప్రీమియర్స్‌‌‌‌‌‌‌‌ చూసే ప్రేక్షకుల కోసం కోటి రూపాయల కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు.  

ఆ వివరాలను తెలియజేసేందుకు ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు. హీరో, దర్శకనిర్మాత పూర్వజ్ మాట్లాడుతూ ‘ప్రీమియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోలో సినిమా చూసి, సెకండాఫ్​లో వచ్చే  కీలక ట్విస్ట్‌‌‌‌‌‌‌‌కు ఓ కారణాన్ని ఊహించి,  ఇంటర్వెల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఐదు నిమిషాలలోపు మా వాట్సప్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7330608675 )కు పంపాలి.  వచ్చిన సమాధానాలన్నీ వీడియో రికార్డ్ చేస్తాం.  సక్సెస్‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌ రోజు విజేతను ప్రకటిస్తాం’ అతి తక్కువ టైమ్‌‌‌‌‌‌‌‌లో ఆన్సర్ పంపిన వారికి బహుమతి ఉంటుంది. హైకోర్టు లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొన్ని నిబంధనలతో అగ్రిమెంట్ రాయించి మరీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. ఇక ఇప్పటివరకూ ఏ సినిమాలో చూడని ఓ నావెల్టీ ఈ సినిమాలో ఉంది’ అని చెప్పాడు.  

హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ ‘మీకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తారని వుమెన్ కోసం సూపర్ షీ కాంటెస్ట్ నిర్వహించి ఎనిమిది మందిని సెలక్ట్ చేసి బహుమతులు ఇచ్చాం. ‘కిల్లర్’ లాంటి బ్రిలియంట్ సబ్జెక్ట్ ను తెరపైకి తీసుకొస్తున్న పూర్వజ్‌‌‌‌‌‌‌‌కు కంగ్సాట్స్‌‌‌‌‌‌‌‌’ అని చెప్పారు.  హైకోర్ట్ లాయర్ సురేష్ , నటీనటులు మానస, చంద్రకాల్, గౌతమ్ చక్రధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మనీష్‌‌‌‌‌‌‌‌ గిలాడా,  లైన్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశరధ తదితరులు పాల్గొన్నారు.