ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి నవ్వుకునేలా..

ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి నవ్వుకునేలా..

మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా శ్రీను కంబాల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్న చిత్రం ‘దొంగ నా కొడుకు’. ఇటీవల టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న మేకర్స్.. బుధవారం ‘ఓ మై గాడ్‌‌‌‌‌‌‌‌’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో హీరో మౌళి మాట్లాడుతూ ‘సింజిత్ తన మ్యూజిక్‌‌‌‌‌‌‌‌తో ఈ సినిమాను మరో లెవల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లాడు. 

యూత్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్ అయ్యేలాభాస్కర భట్ల గారు అద్భుతంగా లిరిక్స్ రాశారు. నా ఫేవరెట్ సింగర్ రామ్ మిరియాల పాడటం అదృష్టంగా భావిస్తున్నా. సినిమా చాలా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. నవంబర్ 13న థియేటర్లలో నవ్వుకోవచ్చు’ అని చెప్పాడు.  

హీరోయిన్ సుష్మిత శెట్టి మాట్లాడుతూ ‘నేను నార్త్ ఇండియన్‌‌‌‌‌‌‌‌ అని చాలామంది అనుకుంటున్నారు.. కానీ తెలుగుమ్మాయిని. మౌళితో కలిసి నటించడం గుడ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్.  సందీప్ మాస్టర్ ఈ పాటను బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌గా కొరియోగ్రఫీ చేశారు’ అని చెప్పింది.  ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని దర్శకుడు శ్రీను కంబాల చెప్పాడు.  సంగీత దర్శకుడు సింజిత్‌‌‌‌‌‌‌‌, డాన్స్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్ సహా టీమ్ పాల్గొన్నారు.