దుబాయ్: ఫ్లైదుబాయ్ విమానంలో కాక్పిట్ అత్యవసర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తో పాటు ఇతర సిబ్బందిని యూఏఈ ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించింది.
సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ మచ్చర్ కాక్పిట్ డోర్ తెరిచి తోటి సిబ్బందికి, ప్రయాణికులకు సంకేతం అందించారు. ఈ సాహసోపేత చర్యను గుర్తించిన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. ఈ ఘటనలో పాల్గొన్న సిబ్బందికి ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ 2’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
