రవితేజ హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తులాభారం’. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తునారు. తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనౌన్స్‌మెంట్‌తోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది.
తాజాగా హీరో రవితేజ తన ఫస్ట్ డే షూట్‌లో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు ముఖ్యనటీనటులంతా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి విడుదల చేసిన ఫొటోలో రవితేజ ఆటోలో కూర్చుని ఉండగా దర్శకుడు వివేక్ ఆత్రేయ సీన్ గురించి వివరిస్తున్నాడు. ఇందులో రవితేజ ఫేస్ రివీల్ చేయకుండా దర్శకుడు మాత్రమే కనిపిస్తు న్నాడు.
క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం రవితేజలోని మరో కోణాన్ని ఆవిష్కరించేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
