నరేష్ అగస్త్య లీడ్ రోల్‌లో శశిధర్ మున్నంగి తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్లపై రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మించారు. ఈనెల 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘కంటెంట్ చూశా. చాలా బాగుంది. వివేక్ కూచిభొట్ల గారి భార్య సూర్యకాంతి గారు ఈ సిరీస్‌తో నిర్మాతగా పరిచయం అవుతున్నారు.
ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. నరేష్ అగస్త్య మాట్లాడుతూ ‘12 ఏళ్ల క్రితం జీలో ‘పసుపు కుంకుమ’తో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత పరువు, వికటకవి చేశా. ఇప్పుడు ‘రుద్రవనం పీఎస్’తో వస్తున్నా. శశి చాలా బాగా తెరకెక్కించాడు. అతని వద్ద ఇంకా చాలా గొప్ప గొప్ప కథలున్నాయి’ అని చెప్పాడు.
దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ ‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగులో గొప్ప ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా నిలుస్తుంది’ అని అన్నాడు. ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రతి ఎపిసోడ్ ఆకట్టుకుంటుందని నిర్మాతలు రమేష్, సూర్యక్రాంతి, వివేక్ కూఛిబొట్ల తెలియజేశారు. నటీనటులు రాజా రవీంద్ర, సుగాలి సిలోని, శ్రావణి రెడ్డి పాల్గొన్నారు.
