ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన ‘దాదా’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే కొరటాల శివ డైరెక్షన్‌లో నెక్స్ట్ సినిమాకు ఆయన ఓకే చెప్పారు. బాలయ్య కెరీర్‌లో ఇది 112వ చిత్రం. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఇది మొదలవడానికి ముందే మరో సినిమా స్టార్ట్ చేసేందుకు కథలు వింటున్నారు. ‘ఇరుముడి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ.. ఇటీవల బాలకృష్ణను కలిసి స్టోరీ లైన్ వినిపించాడట. ఇటీవల మైసూరులో బాలకృష్ణ ‘దాదా’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన్ను కలిశాడట శివ నిర్వాణ. స్టోరీ లైన్ నచ్చడంతో పూర్తి కథను సిద్ధం చేయమని ఆయన సూచించినట్టు సమాచారం.
గతంలో నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్, ఖుషి, ఇరుముడి చిత్రాలతో లవ్ స్టోరీస్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను బాగా హ్యాండిల్ చేయగలడని పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ.. బాలకృష్ణ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ కోసం ఎలాంటి కథను రెడీ చేస్తున్నాడనే ఆసక్తి నెలకొంది. ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘దాదా’ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
