పిల్లలు నటించిన పెద్దల సినిమా సమ్మర్ హాలిడేస్‌‌‌‌‌‌‌‌

పిల్లలు నటించిన పెద్దల సినిమా సమ్మర్ హాలిడేస్‌‌‌‌‌‌‌‌

మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న బాలల చిత్రం ‘సమ్మర్ హాలిడేస్‌‌‌‌‌‌‌‌’.  శ్రీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6న సినిమా విడుదల కానుంది.  బుధవారం నిర్వహించిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఇది చూస్తుంటే నా చిన్నప్పుడు సెలవుల్లో ఊరెళ్లిన మెమొరీస్ గుర్తొచ్చాయి.  

పిల్లలంతా బాగా నటించారు. ఈ యంగ్ టీమ్ ను మీరంతా బ్లెస్ చేయండి. రోహన్ నాతో కలిసి నటించాడు. సినిమా మీద బాగా ఇష్టం ఉన్న యాక్టర్ తను. అలాగే అరుణ్ ను చూస్తుంటే నేషనల్ అవార్డ్ ను చాలా దగ్గరగా చూస్తున్నట్లు ఉంది. ఖుషి బాగా పర్ ఫార్మ్ చేసింది. ఈ చిన్న పిల్లల సినిమాను పెద్ద మనసుతో పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. స్వచ్ఛమైన ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌ను ఇందులో చూస్తారని నటి వాసుకి చెప్పారు.  

డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ ‘ప్రతి ప్రేక్షకుడి గుండెను తాకేలా మా సినిమా ఉంటుంది. కొన్నేళ్లపాటు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటారు. ప్రతి సీన్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని చెప్పాడు.  నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా. పిల్లల కంటే అనేక రెట్లు పెద్దలు ఎంజాయ్ చేస్తారు. ఏమాత్రం బోర్ కొట్టదు, నిర్మాతగా ఇది నా ప్రామిస్’ అని చెప్పారు.  మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్‌‌‌‌‌‌‌‌, బేబి ఖుషి, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, రైటర్ కొండల్ రావు పాల్గొన్నారు.