జ్యోతిష్యం: సింహరాశి.. మఘ నక్షత్రంలోకి గురుడు.. ఏడు రాశుల వారికి కోరికలు నెరవేరే టైం వచ్చేసింది..!

జ్యోతిష్యం: సింహరాశి.. మఘ నక్షత్రంలోకి గురుడు.. ఏడు రాశుల వారికి కోరికలు నెరవేరే టైం వచ్చేసింది..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యోతిషశాస్త్రంలో గురు గ్రహ సంచారానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. . జీవితం అన్ని విధాలా సాఫీగా, హ్యాపీగా సాగిపోవాలంటే గురుడి అనుగ్రహం చాలా అవసరం. అంతటి ప్రాముఖ్యత ఉన్న గురుడు  2026 అక్టోబర్​ 31 మధ్యాహ్నం  12:50 గంటలకు సింహరాశి.. మఘ నక్షత్రంలోకి  ప్రవేశించనున్నాడు.  

సింహరాశిలో గురుడు ..మఘ నక్షత్రంలో  సంచారం వలన  ఏడు ( మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనస్సు) రాశుల వారి తలరాతలు మారి కోరికలు నెరవేరే టైం వచ్చేసిందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . . !

మేషరాశి:  గురుడు సింహరాశి మఘ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారు అన్ని విషయాలను పట్టుదలతో సాధిస్తారు. ఏ రంగంలో ఉన్నా అనుకున్న పనులను సాధిస్తారు.   ఇతరులకు భిన్నంగా ఆలోచనలు చేస్తారని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి.వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆస్తిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

వృషభరాశి:  గురుడు మఘ నక్షత్రం.. సింహరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి ఆశలు, కోరికలను చాలా వరకు నెరవేరతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ధైర్యాన్ని, శౌర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.  ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  భూమి, భవనాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.   వ్యాపారస్తుల కొత్త పెట్టుబడులు  మంచి లాభాలు వస్తాయి.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కర్కాటకరాశి:గురుడు.. సింహరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి గతంలో ఆగిపోయిన పనుల్లో స్పీడ్​ పెరుగుతుదంది. కొత్త పరిచయాలు ఏర్పడటం వలన  ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.ఉద్యోగస్తుల విషయంలో  ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది.   వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.  వ్యాపారస్తులకు ఒక్కసారిగా... అనుకోకుండా లాభాలు వస్తాయి.  ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తోబుట్టువుల మధ్య విబేధాలు తొలగి ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

సింహ రాశి : గురుడు .. సింహరాశిలో సంచారంవలన ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారం కోసం, వృత్తి, వ్యాపారాల్లో ఆధిపత్యం కోసం పాటుబడి ఘన విజయం సాధించే అవకాశం ఉంది.రాబడి అంచనాల్ని మించడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంది.  పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడటంతో... గతంలో ఉన్న బాకీల నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  వృత్తి పరంగా పురోగతి ఉంటుంది.  వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెడితే మూడు రెట్లు లాభాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు.  

తులా రాశి: సింహరాశిలో గురుడి సంచారం వలన ఈ రాశి వారు ఉద్యోగంలో అందలాలు ఎక్కే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పైచేయి సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి సమయం.   సహోద్యోగుల నుంచి  ప్రశంసలు అందుకుంటారు. బదిలీ కోసం ప్రయత్నిస్తుంటే .. అనుకున్న ఫలితాన్ని పొందుతారు.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. 

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి మనసులోని కోరిక నెరవేరే సమయం వచ్చేసిందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. సంతోషంగా, సంతృప్తికరమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్తారు. అన్ని రకాల రుణాలు తీర్చుకోగలుగుతారు.  అన్ని రంగాల్లో  విజయం సాధిస్తారు. వివిధ మార్గాలద్వారా సంపదను పొందుతారు. సంపదను కూడబెడతారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబంలో గొడవలు సమసిపోతాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. నిలిచిపోయిన డబ్బును పొందుతారు. ఉద్యోగస్తులు , వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు . వారి కెరీర్‌లో కొత్త శిఖరాలకు చేరుకుంటారు.

ధనుస్సు రాశి:  గురుడు.. సింహరాశి.. మఘ నక్షత్రంలో సంచారం వలన   ఈ రాశి వారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారమవుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, కొత్త అవకాశాలు  లభించే అవకాశం . కొందరికి పదోన్నతి లేదా వేతన పెంపు కూడా దక్కవచ్చు. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ముఖ్యమైన ఒప్పందాలు, కాంట్రాక్టులు లాభదాయకంగా మారవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది.  దీర్ఘ కాలంగా ఉన్న రుణాలను తిరిగి చెల్లించగలుగుతారు. వ్యాపారస్థులు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అన్ని పనులు ప్రశాంతంగా జరుగుతాయి. కొత్త ప్రేమలు పుట్టుకువస్తాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.