టాస్ గెలిచి మళ్లీ బౌలింగ్ తీసుకున్న భారత్.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్

టాస్ గెలిచి మళ్లీ బౌలింగ్ తీసుకున్న భారత్.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్

IND vs NZ: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20 (4th T20I) మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి ఫీల్డింగ్ (బౌలింగ్) తీసుకున్నాడు. ఇప్పటికే సిరీస్‌ను 3–0తో కైవసం చేసుకున్న ఇండియన్ టీమ్, ఈ మ్యాచ్‌లో గెలిచి క్లీన్ స్వీప్ లక్ష్యంగా దూసుకెళ్లనుండగా.. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ పరువు కోసం పోరాడేందుకు సిద్ధమయ్యాడు.

భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. మేము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం, గత మ్యాచ్‌ల ట్రెండ్‌ను ఇక్కడా ఫాలో అవుతున్నాం.. మొదటి బంతి నుంచి మా బ్యాటర్లు సానుకూల దృక్పథంతో, అద్భుతమైన ఎగ్జిక్యూషన్‌తో ఆకట్టుకున్నారు. ఈడెన్ పార్క్‌లో గాలి తీవ్రత ఎక్కువగా ఉంది, వాతావరణం మరింత చల్లగా మారుతోంది. ఏది ఏమైనా మైదానంలో కనికరం లేకుండా (Ruthless) ఆడటం చాలా ముఖ్యం.. ఆటగాళ్లందరికీ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాం.. మా జట్టు మంచి జోష్ లో కనిపిస్తోంది. ఈ పిచ్‌పై 'ఎక్స్ట్రా' (Extra) బౌన్స్, సీమ్ మూమెంట్ లభిస్తుందని అనుకుంటున్నాం.. తుది జట్టులో రెండు మార్పులు చేశాం.. వైభవ్ స్థానంలో ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్ స్థానంలో మయాంక్ యాదవ్ జట్టులోకి వచ్చారని శ్రేయస్ వెల్లడించాడు.

కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. ఈరోజు మరో కొత్త ఆరంభం.. ఇక్కడ పిచ్‌పై కాస్త అదనపు బౌన్స్ లభిస్తుంది, బ్యాటింగ్‌కు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తోంది.. ఒకసారి క్రీజులో కుదురుకుంటే పరుగులు రాబట్టడం సులభం.. మా బ్యాటర్లు గత మ్యాచ్‌లలో బాగానే రాణించారు.. ఈరోజు గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో క్యాచ్‌లు పట్టడం కొంచెం కష్టంగా మారవచ్చు.. పవర్‌ప్లేలో భారత్ దూకుడుగా ఆడుతుంది కాబట్టి మా ప్రణాళికలపై చర్చించాం.. జట్టులో ఒక మార్పు చేశాం.. కైల్ జేమీసన్ స్థానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు. 

ఇరు జట్లు 

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్