పెద్దపల్లి జిల్లా: వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పెద్దపల్లి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కామన్ చౌరస్తా, అయ్యప్ప గుడి చౌరస్తాల వద్ద ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ప్రతి వాహనానికి సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలని, వాహనాలకు నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
