Pakistan vs India: హాంగ్ కాంగ్ వేదికగా జరుగుతున్న హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026 (Hong Kong Sixes 2026) టోర్నీలో భారత జట్టుకు దారుణమైన అవమానం ఎదురైంది. ఈరోజు (2026, అక్టోబర్ 30, శుక్రవారం) మోంగ్ కాక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్‌లో జరిగిన హై-వోల్టేజ్ పోరులో పాకిస్తాన్ జట్టు టీమిండియాపై ఘన విజయం సాధించింది. 6 ఓవర్ల ఈ ఫార్మాట్‌లో భారత్ నిర్దేశించిన 89 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ బ్యాటర్లు వీరబాదుడు బాదుతూ ఈజీగా ఛేదించారు.
ఒక్క ఓవర్‌లోనే 5 సిక్సర్లు.. 8 బంతుల్లో 35 రన్స్:
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 6 ఓవర్లలో 88 పరుగులు సాధించి ఫర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి బంతి నుంచే ఉతుకుడు మొదలుపెట్టింది.
* మొదటి ఓవర్‌లోనే 31 రన్స్: టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya) వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌ను పాక్ బ్యాటర్ అబ్బాస్ అఫ్రిది ఓ ఆటాడుకున్నాడు.
* 8 బంతుల్లో 35 నాకౌట్: అఫ్రిది వరుసగా 5 భారీ సిక్సర్లు బాది కేవలం 8 బంతుల్లోనే 35 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ చేతుల నుంచి లాగేసుకున్నాడు. తొలి ఓవర్‌లోనే 31 పరుగులు రాబట్టడంతో పాక్ విజయం నల్లేరుపై నడకలా మారింది.
* భారత బౌలర్ల దరిద్రమైన బౌలింగ్, పాక్ బ్యాటర్ల విధ్వంసంతో హాంగ్ కాంగ్ సిక్సెస్‌లో టీమిండియా ఓటమి పాలవ్వడం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
Pak vs Ind Finally Pak won a match after ages. Hong kong Sixes 🤣
— Abey Kuruwila 3.0 🎭 (@kuruwila) October 30, 2026
