శంషాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. . గోడను ఢీకొని పల్టీలు కొట్టిన ఇన్నోవా

శంషాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. .  గోడను ఢీకొని పల్టీలు కొట్టిన ఇన్నోవా

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని నర్కూడ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న టయోటా ఇన్నోవా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది.

ఢీకొన్న వేగానికి కారు పలుమార్లు బోల్తా పడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద తీవ్రతకు ఇన్నోవా కారు నుజ్జునుజ్జు కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? కారు అదుపుతప్పడానికి గల ఖచ్చితమైన కారణాలేమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.