ప్రేమకథలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ సహజమైన భావోద్వేగాలు, అందమైన అనుబంధాలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు మరింతగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు అలాంటి ఓ అందమైన ప్రేమకథతో రూపొందిన 'ప్రేమాయణం' వెబ్ సిరీస్ యూట్యూబ్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ తొలి ఎపిసోడ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల విడుదలైన షార్ట్ ఫిల్మ్స్‌లో ప్రత్యేకంగా నిలుస్తూ ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
'ప్రేమాయణం' వెబ్ సిరీస్‌కు సూర్య మురపాక కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. హర్షిణి పిక్చర్స్ బ్యానర్‌పై కె. హర్షిణి యాదవ్ నిర్మించారు. హరి సంగీతం అందించారు. పవన్, నైనిక అనసూయ ప్రధాన పాత్రల్లో నటించగా.. శ్రీలత, హరీశ్, కె. సంతోష్ తయ్యప్ప, దేవిక తదితరులు సహాయక పాత్రల్లో కనిపించారు.
ప్రేమకథకు భావోద్వేగాలను జోడిస్తూ రూపొందించిన ఈ సిరీస్‌లో నటీనటుల సహజమైన నటన, కథనంలోని ఆసక్తికరమైన అంశాలు, సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యే ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ కథ సాగుతోంది.
భారీ ప్రచారం, హంగులు లేకుండానే మంచి కంటెంట్‌తో ప్రేక్షకులకు చేరువవుతున్న 'ప్రేమాయణం'కు యూట్యూబ్‌లో వస్తున్న స్పందన చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తొలి ఎపిసోడ్‌కు లభిస్తున్న ఆదరణతో దర్శకుడు సూర్య మురపాక, నిర్మాత కె. హర్షిణి యాదవ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎపిసోడ్స్‌లో కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
