రాజశేఖర్ వర్మ, రితికా చక్రవర్తి జంటగా వి. హరిహరన్ తెరకెక్కించిన చిత్రం ‘కాళాంకి భైరవుడు’. రాచమల్లు శ్రీనివాసరావు నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే టీజర్, రెండు పాటలు విడుదలయ్యాయి. తాజాగా మూడో పాటను విడుదల చేశారు.
హీరో మంచు మనోజ్ ఈ పాటను విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. చేతబడులు, క్షుద్ర పూజలు, నిజ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆశ్చర్యకర సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు హరిహరన్ తె లియజేశారు. ప్రేక్షకులను థ్రిల్ చేసే కంటెంట్‌తో రూపొందించామని నిర్మాత రాచమల్లు శ్రీనివాసరావు వెల్లడించారు. పూజ కిరణ్, భవ్యశ్రీ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్. సంగీతం అందిస్తుండగా, అశోక్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
