‘జబర్దస్త్’ కమెడియన్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్‌లో చెందు ముద్దు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఇద్దరి గుండెలపైన’ అంటూ సాగే పాటను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.
పాట చాలా బాగుందని, సినిమా కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉందని అన్నారు. మారుతి రాజా కంపోజ్ చేసిన పాటకు శ్రీరామ్ తపస్వి లిరిక్స్ రాయగా, సాయి చరణ్ భాస్కరుణి, అభిఖ్య తణికెళ్ల పాడారు. చంద్రకిరణ్ కొరియోగ్రఫీ అందరూ రీల్స్‌తో ట్రెండ్ చేసేలా ఉన్నాయి. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని మేకర్స్ అన్నారు.
