తెలంగాణ ప్రజలు కాంగ్రస్కు శాశ్వత అధికారం ఇస్తారు..భయంతోనే గ్లోబల్ సమ్మిట్‌‌‌‌పై కేటీఆర్ విమర్శలు ..

తెలంగాణ ప్రజలు కాంగ్రస్కు శాశ్వత అధికారం ఇస్తారు..భయంతోనే గ్లోబల్ సమ్మిట్‌‌‌‌పై కేటీఆర్ విమర్శలు ..
  • పీసీసీ మీడియా విభాగం చైర్మన్ చామల కిరణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తొమ్మిదిన్నరేండ్ల దుర్మార్గపు పాలనను చూసిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌‌‌‌ను శాశ్వతంగా అధికారంలో ఉంచుతారనే భయంతోనే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌‌‌‌పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని పీసీసీ మీడియా, పబ్లిసిటీ విభాగం చైర్మన్, ఎంపీ చామల కిరణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం నిర్వహిస్తున్నది గ్లోబల్‌‌‌‌ సమ్మిట్‌‌‌‌ అని, కేటీఆర్ ప్రచారం చేస్తున్నట్టుగా గోబెల్స్‌‌‌‌ సమిట్ కాదని స్పష్టం చేశారు.ఈ మేరకు గురువారం గ్లోబల్ సమ్మిట్‌‌‌‌లో పాల్గొన్న ఆయన, కేటీఆర్ చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ తన హయాంలో భూస్థాపితం చేసిందని, రాష్ట్రంలోని విద్యుత్, ఇరిగేషన్‌‌‌‌ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ యువతకు సరైన ఉపాధి, స్కిల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఈ గ్లోబల్‌‌‌‌ సమ్మిట్‌‌‌‌ను నిర్వహిస్తున్నారని చామల  వివరించారు.
వారణాసిలో ఎమ్మెల్సీల ఓటమిపై 
మోదీ మౌనమేల?
ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ పరాజయం పాలవ్వడంపై ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని చామల కిరణ్‌‌‌‌కుమార్‌‌‌‌ రెడ్డి ప్రశ్నించారు. వారణాసిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటినీ ఇండియా కూటమి కైవసం చేసుకుందని ఆయన గుర్తుచేశారు.