క్యూ2లో రూ.59.8 కోట్లు
హైదరాబాద్, వెలుగు : క్లీన్ ఎనర్జీ, న్యూక్లియర్, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు ప్రిసిషన్ ఇంజనీరింగ్ ఉత్పత్తులను అందించే ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) లో ఆల్‌టైమ్ రికార్డు ఫలితాలను నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం గతేడాది ఇదే క్వార్టర్‌లో నమోదైన రూ.135.6 కోట్లతో పోలిస్తే ఏకంగా 200శాతం పెరిగి రూ.406.8 కోట్లకు చేరింది. కంపెనీ ఇబిటా(పన్నులు, వడ్డీలకు ముందు లాభం) 483.3శాతం వృద్ధితో రూ.99.2 కోట్లుగా నమోదైంది. ఇక పన్ను తర్వాతి లాభం గతేడాది నమోదైన రూ.4.2 కోట్ల నుంచి ఏకంగా 1,309.5శాతం పెరిగి రూ.59.8 కోట్లను తాకింది. సరికొత్త మైలురాయిని సృష్టించింది. క్యూ1తో పోలిస్తే కంపెనీ నికర లాభం 19శాతం పెరిగింది.
