తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ & స్టాటిస్టిక్స్ శాఖలో మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్/ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 30న ప్రారంభం కాగా నవంబర్ 27 వరకు అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్/ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్.
మొత్తం పోస్టులు: 102.
జోన్ల వారీగా ఖాళీలు: జోన్–-I 11, జోన్–II 13, జోన్ –III 14, జోన్–IV 16, జోన్ –V 6, జోన్–VI 24, జోన్ VII 11, ఓపెన్ 7 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు
స్టాటిస్టిక్స్ ఒక ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా
గణితం ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేస్తూ అందులో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా
ఎకనామిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేస్తూ అందులో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా
కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేస్తూ అందులో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. లేదా
కంప్యూటర్ సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ చేస్తూ అందులో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్, ఎన్సీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 30.
ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, బీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
ఎగ్జామినేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.80 చెల్లించాలి.
లాస్ట్ డేట్: నవంబర్ 27.
ఎగ్జామినేషన్ తేదీ: 2027, జనవరి (తాత్కాలికం).
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ tgpsc.gov.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు. పేపర్–2లో స్టాటిస్టిక్స్ (డిగ్రీ స్థాయి) నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు ఇస్తారు.
