ములుగు జిల్లాలో 7 మెడికల్ ఉద్యోగాలు.. రేపే (అక్టోబర్ 31 ) లాస్ట్ డేట్

ములుగు జిల్లాలో 7 మెడికల్ ఉద్యోగాలు.. రేపే (అక్టోబర్ 31 ) లాస్ట్ డేట్

ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్ఓ) కార్యాలయం ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 

మొత్తం ఖాళీలు: 7.
విభాగాల వారీగా ఖాళీలు: ఆయూష్ మెడికల్ ఆఫీసర్ 4, ఫార్మాసిస్ట్ 1, యోగా ప్రొఫెషనల్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1. 
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆయుర్వేద, యునాని, హోమియోపతి లేదా నేచురోపతి విభాగంలో డిగ్రీ, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఫార్మా.-డి,  మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్​లో పోస్ట్ గ్రాడ్యుయేట్,  నేచురోపతిలో డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ పూర్తిచేసి ఉండాలి. 
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి.  బీసీ, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్​లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆఫ్‌‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 26.
లాస్ట్ డేట్: అక్టోబర్ 31.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, వయసు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్mulugu.telangana.gov.inను సందర్శించండి.