హైదరాబాద్ లో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్...!

హైదరాబాద్ లో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్...!

ఏపీలో అర్నబ్ తుఫాను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అర్నబ్ ప్రభావంతో తెలంగాణలో కూడా వాతావరణం చల్లబడింది... అక్కడక్కడా తేలికపాటి  నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిశాయి. ఇవాళ ( అక్టోబర్ 30 ) తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రధానంగా రాత్రి వేళల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రధానంగా ఇవాళ సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఉదయం పొడి వాతావరణం ఉంటుందని.. రాత్రి వేళల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలిపింది వాతావరణ శాఖ. యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.