- పీసీసీ చీఫ్ గైర్హాజరు
అబిడ్స్, వెలుగు: బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ప్రభుత్వ విప్అద్దంకి దయాకర్‌లపై వేసిన పరువునష్టం కేసును హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం విచారించింది. వర్షాలు పడకుండా క్షుద్రపూజలు చేయించానని చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయంటూ హరీశ్‌రావు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన న్యాయస్థానం, మహేశ్‌గౌడ్, దయాకర్వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు, పత్రికా కథనాలను పరిశీలించి, ఇద్దరికీ సమన్లు జారీ చేసింది.
ఈ కేసు విచారణకు విప్అద్దంకి దయాకర్ కోర్టుకు హాజరగా.. మహేశ్ గౌడ్ గైర్హాజరయ్యారు. అద్దంకి వాంగ్మూలాన్ని నమోదు చేసిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 26కు వాయిదా వేసింది. అనంతరం విప్దయాకర్ మాట్లాడుతూ.. హరీశ్‌రావు రాజకీయ కక్షతోనే తనపై పరువు నష్టం దావా వేశారని ఆరోపించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, కోర్టు సమయాన్ని వృథా చేసేలా నిలబడని కేసులు వేయడం సరికాదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు వేయడం సిగ్గుచేటన్నారు. న్యాయస్థానంపై తనకు గౌరవం ఉందని, అందుకే విచారణకు హాజరయ్యానని తెలిపారు.
