నారాయణగూడ, వెలుగు: ఆటో మీటర్ చార్జీలను కిలోమీటర్‌కు రూ.18కు పెంచాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 30న హైదరాబాద్ నగరంలో ఒకరోజు ఆటో బంద్ నిర్వహించనున్నట్లు మహాత్మాగాంధీ తెలంగాణ ఆటోడ్రైవర్స్ జేఏసీ ప్రకటించింది. గురువారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో నిర్వహించిన సమావేశంలో జేఏసీ కన్వీనర్ అమనుల్లా ఖాన్ మాట్లాడారు.
బెంగళూరులో ఆటోమీటర్ చార్జీ కిలోమీటర్‌కు రూ.18 ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.14 నిర్ణయించడం ఏంటని ప్రశ్నించారు. చార్జీల విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే చార్జీని రూ.18కు పెంచి, ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే నిరవధిక బంద్‌కు దిగుతామని హెచ్చరించారు.
