GPS కు పోటీగా NavIC.. ఇస్రో మరో కీలక ప్రయోగం.. ఇవాళ ( అక్టోబర్ 30 ) అర్థరాత్రి రోదసీలోకి GSLV F–18..

GPS కు పోటీగా NavIC.. ఇస్రో మరో కీలక ప్రయోగం.. ఇవాళ ( అక్టోబర్ 30 ) అర్థరాత్రి రోదసీలోకి GSLV F–18..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఇవాళ ( అక్టోబర్ 30 ) అర్థరాత్రి 11:51 గంటలకు GSLV F-18 ద్వారా నావిక్-03 ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. ఈ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. GPS కు పోటీగా ఈ శాటిలైట్ ను ప్రవేశపెట్టనున్నారు శాస్త్రవేత్తలు.

నావిక్-03 సాటిలైట్ తో ఉపయోగాలు:

నావిక్-03 మన దేశ నావిగేషన్ వ్యవస్థ. దీని ద్వారా భారత్ క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ (  IRNSS ) సాటిలైట్ శ్రేణికి నావిగేషన్ సేవలు అందించేందుకు ఉద్దేశించిన సాటిలైట్ సిస్టంలో మూడో సాటిలైట్ నావిక్ 03. ఈ శాటిలైట్ లో నావిగేషన్ పేలోడ్, రేంజింగ్ పేలోడ్ అనే రెండు రకాల పేలోడ్స్ అమర్చినట్లు సమాచారం.

నావిగేషన్ పేలోడ్ ద్వారా వినియోగదారులకు నావిగేషన్ సంకేతాలు ప్రసారం చేయనుంది ఈ శాటిలైట్. ఈ పేలోడ్ ఎల్ 1, ఎల్ 5, ఎస్ బ్యాండ్ లతో పని చేస్తుంది. ఈ పే లోడ్ అత్యంత స్థిరమైన రుబీడియం అటామిక్ క్లాక్ ఏర్పాటు చేశారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సిరీస్‌ ఉపగ్రహాలలో దిగుమతి చేసుకున్న రుబీడియం అటావిుక్‌ క్లాక్‌లు విఫలం కావడంతో అహ్మదాబాద్‌లోని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌లో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించి ఈ ఉపగ్రహంలో అమర్చినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు.

ఇవాళ  రాత్రి 8: 21 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాకెట్‌ ప్రయోగాన్ని 19 నిమిషాల్లో పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. GSLV మార్క్‌–2 సిరీస్‌లో ఇది 20వ ప్రయోగం కావడం గమనార్హం. షార్‌ కేంద్రంగా ఇది 107వ ప్రయోగం.