భూటాన్ లో మంచు కొండ పగిలిపోయింది : బెంగాల్, అసోంకు ఆకస్మిక వరదల ముప్పు!

 భూటాన్ లో మంచు కొండ పగిలిపోయింది : బెంగాల్, అసోంకు ఆకస్మిక వరదల ముప్పు!

భూటాన్ లో హిమనీనదం సరస్సు ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. గురువారం సాయంత్రం భూటాన్‌లోని లిండాంగ్ లో ఉన్న ఎత్తయిన షింటాఫు సరస్సులో హిమనీనదం  విస్పోటనం చెంది వరద ప్రవాహం ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో  వరద ప్రవాహం సంకోష్ నది ద్వారా ఉదృతంగా ప్రవహించడంతో గాసా త్శాచు ప్రాంతంలో ఇండ్లు, డ్యాములు కొట్టుకుపోయాయి. వరద నీరు రాకముందే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో  పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు రాష్ట్రాల వైపు ప్రవహించే నదుల వెంబడి ఉన్న పరివాహక ప్రాంతాలను సహాయక చర్యలు చేపట్టారు. 

భూటాన్ లో హిమనీ నదం విస్పోటనంతో వరద ప్రవాహం సంకోష్ నది ద్వారా ఉత్తర భూటాన్ మీదుగా పశ్చిమ బెంగాల్, ఒడిశాలోకి  ప్రవహిస్తుంది. హిమనీ నదం విస్ఫోటనంతో సరిహద్దుగా ఉన్న పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రభుత్వాలను భూటాన్ అప్రమత్తం చేసింది. అస్సాంలోని ధుబ్రి జిల్లా, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండలు, అలీపుర్‌దువార్, జల్‌పాయిగురిలను ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లో కూచ్ బెహార్ పరిపాలన యంత్రాంగం సంకోష్ నది ఒడ్డున నివసిస్తున్న నివాసితులను కూడా అప్రమత్తం చేశారు. 
 
మో చ్చు నదికి మూలం అయిన షింటాఫు సరస్సు భూటాన్‌లో ప్రమాదకరమైనవిగా 17 హిమానీనద సరస్సులలో ఒకటి. 2021 ఆగస్టు 26న షింటాఫు ఉప్పొంగడంతో మో చ్చు నది ఆకస్మిక వరదలతో గాసా త్శాచు ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. 

ALSO READ : ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్..ఏ కూటమికీ దక్కని మెజారిటీ..

ఈ ఘటనతో హిమనీనద సరస్సుల నుంచి వచ్చే ఆకస్మిక వరదల ముప్పు మరోసారి తెరపైకి వచ్చింది. వాతావరణ మార్పుల కారణంగా హిమానీనదాలు వేగంగా కరిగి సరస్సుల్లో నీటి మట్టం పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ముందస్తు హెచ్చరికలు, నిరంతర పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ చర్యలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.