ముంబై ఇండియన్స్ కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే.. బ్యాటింగ్ కోచ్‌గా CSK మాజీ ఆటగాడు

ముంబై ఇండియన్స్ కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే.. బ్యాటింగ్ కోచ్‌గా CSK మాజీ ఆటగాడు

Mumbai Indians: ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీ తమ కొత్త కోచింగ్ టీమ్‌ను అధికారికంగా ఖరారు చేసింది. హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ (Kieron Pollard) బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఫ్రాంచైజీ సంస్కృతి, అంతర్జాతీయ అనుభవం కలిగిన నలుగురు దిగ్గజాలను సహాయక సిబ్బందిగా నియమిస్తున్నట్లు ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈరోజు (2026, అక్టోబర్ 30, శుక్రవారం) వెల్లడించింది. ఇటీవలే లసిత్ మలింగ, పరాస్ మాంబ్రే, కార్ల్ హాప్‌కిన్సన్‌లు వైదొలిగిన తర్వాత రోజే కొత్త కోచింగ్ బృందాన్ని ప్రకటించింది. 

ముంబై ఇండియన్స్ కొత్త కోచింగ్ స్టాఫ్: 

* హెడ్ కోచ్ (Head Coach): కేరన్ పొలార్డ్ (Kieron Pollard)

* బ్యాటింగ్ కోచ్ (Batting Coach): రాబిన్ ఉతప్ప (Robin Uthappa)

* బౌలింగ్ కోచ్ (Bowling Coach): మిచెల్ మెక్‌క్లెనాగన్ (Mitchell McClenaghan)

* ఫీల్డింగ్ కోచ్ (Fielding Coach): టి. దిలీప్ (T. Dilip)

* డెవలప్‌మెంట్ బౌలింగ్ కోచ్ (Development Bowling Coach): ధావల్ కులకర్ణి (Dhawal Kulkarni)

పల్టాన్ కల్చర్, అంతర్జాతీయ అనుభవంతో సరికొత్త వ్యూహం:

* ఈ నలుగురు కొత్త కోచ్‌ల నియామకంతో ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్‌కు పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. 

* మిచెల్ మెక్‌క్లెనాగన్, ధావల్ కులకర్ణి: గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఫాస్ట్ బౌలర్లుగా పలు టైటిళ్ల విజయంలో కీలక పాత్ర పోషించిన మెక్‌క్లెనాగన్, ధావల్ కులకర్ణిలు తిరిగి రావడం జట్టు పేస్ విభాగానికి కొండంత బలాన్ని ఇవ్వనుంది.

* టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్: భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించి, జట్టులో ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచిన తెలుగు వ్యక్తి టి. దిలీప్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

వెల్కమ్ బ్యాక్ రాబీ.. పొలార్డ్ నేతృత్వంలో కొత్త సపోర్ట్ స్టాఫ్:

* 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న రాబిన్ ఉతప్ప, సుదీర్ఘ విరామం తర్వాత కోచ్‌గా తిరిగి 'ముంబై పల్టాన్' గుడారంలోకి చేరుకున్నాడు. 

* ముంబై అధికారిక పోస్ట్: మా తొలి సీజన్‌లో భాగమైన ఆటగాడు, ఎంతో అనుభవంతో తిరిగి జట్టులోకి రావడం చాలా ఆనందంగా ఉంది.. రాబీ ఆటపై ఉన్న పదునైన అవగాహన, సులభంగా కమ్యూనికేట్ చేసే శైలి, యువ ఆటగాళ్లను నడిపించే క్లారిటీ జట్టుకు ఎంతగానో ఉపకరిస్తాయి. వెల్కమ్ బ్యాక్ రాబిన్! అంటూ ముంబై ఇండియన్స్ తమ X (ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.

* రాబిన్ ఉతప్ప: ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా ఆడిన ఉతప్ప.. భారత జట్టుతో పాటు పలు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన రాబిన్ ఉతప్ప సుదీర్ఘ అనుభవం, ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్లను తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది. 

* దిగ్గజ కోచ్ మహేల జయవర్ధనే స్థానంలో కీరన్ పొలార్డ్ హెడ్ కోచ్‌గా పగ్గాలు స్వీకరించిన తర్వాత ముంబై మేనేజ్‌మెంట్ సరికొత్త సపోర్ట్ స్టాఫ్‌ను సిద్ధం చేసింది. 

* మలింగ, మాంబ్రే ఔట్: గురువారమే ఫాస్ట్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ, పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్‌కిన్సన్‌లను తప్పించిన ముంబై, ఇప్పుడు కొత్త కోచ్‌లను అనౌన్స్ చేసింది