ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాడు. ఇందులో భాగంగా ఆక్లాండ్‌లో టీ20 జట్టుతో కలిసి తాజాగా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చాడు. నవంబర్ 4 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
శిక్షణ సందర్భంగా గిల్ తన నుదుటిపై ‘టెంపుల్’ అనే ఫిట్‌నెస్ ట్రాకింగ్ పరికరాన్ని ధరించాడు. అభిషేక్‌తో కాసేపు ముచ్చటించిన గిల్ తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, పేసర్ గుర్నూర్ బ్రార్ కూడా టీమ్‌తో చేరి ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్‌తో మాట్లాడి సలహాలు తీసుకున్నారు. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ
ఇవ్వాల్సి ఉంది.
