సార్‌బ్రూకెన్: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. హైలో ఓపెన్ సూపర్–500 టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో సింధు 21–9, 21–6తో రోసీ ఆక్టావియా పాంకాసరి (ఫ్రాన్స్)పై గెలిచింది.
ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సింధు ఆధిపత్యమే కొనసాగింది. బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో ఆడిన మొత్తం 57 పాయింట్లలో 42 గెలుచుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో మాళవిక బన్సోద్ 11–21, 17–21తో వెన్ యు జాంగ్ (కెనడా) చేతిలో, ఇషారాణి బరువా 14–21, 19–21తో లైన్ హోజ్‌మార్క్ క్యార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్) చేతిలో ఓడారు.
