జలంధర్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో ఇండియా మెన్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 5–2తో చైనాను ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చూపెట్టిన ఇండియా తరఫున సుఖ్‌జీత్ సింగ్ (12, 34వ నిమిషం), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (27, 31వ ని), జుగ్‌రాజ్ సింగ్ (47వ ని) గోల్స్ చేశారు.
పెంగ్ యాంగ్ (26వ ని), చొంగ్కాంగ్ (36వ ని) చైనాకు గోల్స్ అందించారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఇండియన్ ఫార్వర్డ్స్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. కీలక టైమ్‌లో పెనాల్టీలను గోల్స్‌గా మలిచారు. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. జపాన్‌తో తలపడుతుంది.
