టీసీఐ ఆదాయం రూ.1,398 కోట్లు.. రెండో క్వార్టర్‌లో 3 శాతం పెరిగిన నికర లాభం

టీసీఐ ఆదాయం రూ.1,398 కోట్లు.. రెండో క్వార్టర్‌లో 3 శాతం పెరిగిన నికర లాభం

హైదరాబాద్, వెలుగు: లాజిస్టిక్స్, సప్లై చైన్ సేవల సంస్థ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (టీసీఐ) ఈ ఆర్థిక సంవత్సరం 2వ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.1,397.9 కోట్ల ఆదాయం సంపాదించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.1,217.4 కోట్లుగా నమోదైంది. నికర లాభం 3 శాతం వృద్ధితో రూ.113.5 కోట్ల నుంచి రూ.116.9 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం (ఎబీటా) 8.3 శాతం వృద్ధితో రూ.162.4 కోట్ల నుంచి రూ.175.9 కోట్లకు చేరింది. వాణిజ్యం, వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సంస్థ రవాణా, గిడ్డంగులకు మంచి డిమాండ్ వస్తోందని ఎండీ వినీత్ అగర్వాల్ పేర్కొన్నారు.