హైదరాబాద్, వెలుగు: గోద్రెజ్ వెల్త్ హైదరాబాద్‌లో గురువారం తన కార్యకలాపాలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 35 నగరాలకు విస్తరించి, 2031 నాటికి రూ. లక్ష కోట్ల నిర్వహణ ఆస్తులను (ఏయూఎం) సాధించాలనే వ్యూహంతో సంస్థ ముందుకు సాగుతోంది. భారతదేశంలోని అత్యంత సంపన్న (యూహెచ్ఎన్‌డబ్ల్యూ) జనాభాలో 6.3 శాతం మంది హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. ఇక్కడ దాదాపు 19,800 లక్షాధికారుల కుటుంబాలు ఉన్నాయి. జులై 2026 నాటికి నగరంలో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ 18 శాతం పెరిగి రూ.1.84 లక్షల కోట్లకు చేరింది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులున్న హెచ్ఎన్‌ఐ సంపన్నులకు ప్రత్యేక సేవలు అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందని కంపెనీ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు.
