హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎం భారీ కొత్త ఆఫీస్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎం భారీ కొత్త ఆఫీస్

హైదరాబాద్, వెలుగు: ట్యాక్స్, ఆడిటింగ్ వంటి సేవలు అందించే కన్సల్టింగ్ కంపెనీ ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎం యూఎస్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఇండియా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ గచ్చిబౌలిలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఆఫీసును గురువారం ప్రారంభించింది. నగరంలో పెరుగుతున్న సాంకేతిక నిపుణుల అవసరాలకు అనుగుణంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. గత 3 ఏళ్లలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగుల సంఖ్యను సంస్థ 150 శాతం పెంచింది. ట్యాక్స్, అస్యూరెన్స్, డిజిటల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్, ఇన్నోవేషన్ విభాగాల్లో నైపుణ్యం కలిగిన బృందాలను రూపొందించేందుకు ఈ విస్తరణ దోహదపడనుంది. అత్యాధునిక సౌకర్యాలు, స్మార్ట్ మీటింగ్ రూమ్స్, సెన్సర్ ఆధారిత గదుల నిర్వహణతో ఈ కొత్త ఆఫీసును తీర్చిదిద్దినట్లు సంస్థ ఇండియా లీడర్ అశోక్‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్ పేర్కొన్నారు.