హైదరాబాద్‌లో యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్‌పో.. దుబాయ్ లోపెట్టుబడులపై అవగాహన

హైదరాబాద్‌లో యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్‌పో.. దుబాయ్ లోపెట్టుబడులపై అవగాహన

హైదరాబాద్, వెలుగు: యూఏఈలోని దుబాయ్, అజ్మాన్ నగరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఎడ్జ్ అడ్వర్టైజ్‌‌‌‌‌‌‌‌మెంట్స్ తెలిపింది. రియల్టీ పెట్టుబడులు, గోల్డెన్ వీసా, స్థిర నివాసం గురించి అవగాహన కలిగించడానికి అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పో 2026 నిర్వహిస్తున్నామని పేర్కొంది. జేఆర్‌‌‌‌‌‌‌‌సీ కన్వెన్షన్స్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఈ కార్యక్రమం ద్వారా యూఏఈ డెవలపర్లు, భారతీయ పెట్టుబడిదారులను అనుసంధానిస్తారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారతీయ పెట్టుబడిదారుల వాటా 22 శాతం వరకు ఉంది. ఏటా 30 బిలియన్ దిర్హామ్‌‌‌‌‌‌‌‌లకు పైగా భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారని సీఈవో రఘు పెలక్కాట్ తెలిపారు. దుబాయ్‌‌‌‌‌‌‌‌లో ఆస్తులపై సగటున 7 శాతం అద్దె ఆదాయం లభిస్తుందని అన్నారు.