జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లాభం 86 శాతం జంప్.. రూ.65 కోట్లకు చేరిన నికర లాభం

జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లాభం 86 శాతం జంప్.. రూ.65 కోట్లకు చేరిన నికర లాభం

న్యూఢిల్లీ: జీఎంఆర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 86 శాతం పెరిగి రూ.65 కోట్లకు చేరుకుంది. విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ కేవలం 1 శాతం మాత్రమే పెరిగినప్పటికీ, ఏరో, నాన్ ఏరో విభాగాల నుంచి వచ్చిన ఆదాయం వృద్ధికి తోడ్పడింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ రూ.35 కోట్ల లాభం సంపాదించింది. మొత్తం ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.4188 కోట్లకు ఎగబాకింది. ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో జీఎంఆర్ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. కేవలం ఢిల్లీ విమానాశ్రయం ఈ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 1.81 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ లిమిటెడ్ (డయల్​) నికర లాభం రూ.74 కోట్ల నుంచి రూ.121 కోట్లకు పెరిగింది.