ముంబై: ఐపీఎల్–2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ఇప్పటికే హెడ్ కోచ్ మహేల జయవర్ధనేను తప్పించిన ఫ్రాంచైజీ.. బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ, పారస్ మాంబ్రేతో పాటు ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్‌కిన్సన్‌కు గుడ్‌బై చెప్పింది.
వీళ్ల ప్లేస్‌లో ఎవర్ని నియమించలేదు. తమ ఫ్రాంచైజీ విజయాల్లో ఈ ముగ్గురు కోచ్‌లు అందించిన అమూల్యమైన సేవలకు ముంబై ఇండియన్స్ కృతజ్ఞతలు చెప్పింది. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ ప్లేయర్‌గా, మెంటర్‌గా, కోచ్‌గా ముంబై జట్టుతో సుదీర్ఘ అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. ముంబై నాలుగు ఐపీఎల్ టైటిల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
