తనీషా సింగ్‌ విధ్వంసం.. మహిళల టీ20ల్లో ఢిల్లీ జట్టు వరల్డ్‌ రికార్డు స్కోరు!

తనీషా సింగ్‌ విధ్వంసం.. మహిళల టీ20ల్లో ఢిల్లీ జట్టు వరల్డ్‌ రికార్డు స్కోరు!

పుణె: సీనియర్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ టీ20 ట్రోఫీలో ఢిల్లీ జట్టు వరల్డ్‌‌‌‌ రికార్డు స్కోరును నమోదు చేసింది. హైదరాబాద్‌‌‌‌తో గురువారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో.. తనీషా సింగ్‌‌‌‌ (47 బాల్స్‌‌‌‌లో 25 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 119) సునామీ ఇన్నింగ్స్‌‌‌‌తో.. ముందుగా బ్యాటింగ్‌‌‌‌ చేసిన  ఢిల్లీ 20 ఓవర్లలో 262/6 స్కోరు చేసింది. డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇప్పటివరకు ఈ ఘనత గోవా పేరిట ఉండేది.

2019–20 సీజన్‌‌‌‌లో అరుణాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌పై గోవా  257/2 స్కోరు చేసింది. 38 బాల్స్‌‌‌‌లో సెంచరీ చేసిన తనీషా.. విమెన్స్‌‌‌‌ టీ20ల్లో సంయుక్తంగా మూడో వేగవంతమైన సెంచరీ రికార్డును అందుకుంది. ప్రియా పూనియాతో కలిసి రెండో వికెట్‌‌‌‌కు కేవలం 66 బాల్స్‌‌‌‌లోనే 160 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ నెలకొల్పింది. భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌‌‌‌ 20 ఓవర్లలో 154/8 స్కోరుకే పరిమితమైంది. దాంతో ఢిల్లీ 108 రన్స్‌‌‌‌ తేడాతో విజయం సాధించింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌లో తనీషా అన్‌‌‌‌సోల్డ్‌‌‌‌గా  మిగలడం గమనార్హం.