ఎలక్ట్రానికా ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌లో సైయెంట్ చిప్‌‌‌‌‌‌‌‌లు

ఎలక్ట్రానికా ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌లో సైయెంట్ చిప్‌‌‌‌‌‌‌‌లు

హైదరాబాద్, వెలుగు :  చిప్‌‌‌‌‌‌‌‌ కంపెనీ సైయెంట్ సెమీకండక్టర్స్ జర్మనీలోని మ్యూనిక్​లో నవంబర్ 10 నుంచి 13 వరకు జరగనున్న ‘ఎలక్ట్రానికా 2026’ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌లో తమ సెమీకండక్టర్ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోను ఆవిష్కరిస్తామని ప్రకటించింది. ఏఐ డేటా సెంటర్లు, ఎడ్జ్ ఏఐ, ఈ-–మొబిలిటీ కోసం రూపొందించిన విద్యుత్ నిర్వహణ సాంకేతికతలతో పాటు అత్యాధునిక కస్టమ్ ఏసిక్  పరిష్కారాలను కంపెనీ ప్రదర్శించనుంది. 

సైయెంట్ సబ్సిడరీ కంపెనీ  కైనెటిక్ టెక్నాలజీస్ రూపొందించిన పవర్ ప్రొటెక్షన్, డీసీ/డీసీ కన్వర్షన్,  ఆటోమోటివ్ చిప్‌‌‌‌‌‌‌‌లను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్లు, ఆటోమేషన్ కోసం నెక్స్ట్ జనరేషన్ 800వీ+ హై-వోల్టేజ్ పవర్ టెక్నాలజీలను సంస్థ అభివృద్ధి చేస్తోంది. కైనెటిక్ ఇప్పటికే ఏటా 25 కోట్ల యూనిట్లను సరఫరా చేస్తోంది.