ఇన్ స్పైర్ చేసే.. డియర్ ఆస్ట్రోనాట్ 

ఇన్ స్పైర్ చేసే.. డియర్ ఆస్ట్రోనాట్ 

సౌమిత్, శ్రేయాసి సేన్, కమల్ కామరాజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్,  గీతా భాస్కర్, శరణ్య ప్రదీప్  ముఖ్య పాత్రల్లో  కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. యువన్‌‌‌‌కృష్ణ  ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థ నిర్మించింది. నవంబర్ 20న సినిమా విడుదల కానుంది. గురువారం సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ఆస్ట్రోనాట్ అవ్వాలనే కోరిక ఉండటం, ఆ కోరిక చుట్టూ కథను తీయడం బాగుంది. 

ఇది చాలా మంచి ప్రయోగం. ఎవరైనా సరే ఎంత పెద్ద కలలైనా కనొచ్చు, వాటిని సాకారం చేసుకోవచ్చు అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేలా సినిమాని రూపొందించారు. టెక్నికల్‌‌‌‌గా కూడా  ఎంతో క్వాలిటీగా ఉందనిపిస్తోంది. ఇలాంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’ అని అన్నారు.  

ఇలాంటి చిత్రాన్ని తెర మీదకు తీసుకు రావడమే గొప్ప సాహసం అని నటుడు కమల్ కామరాజ్ అన్నాడు. ప్రతి ఒక్కరినీ ఇన్‌‌‌‌స్పైర్ చేసే చిత్రమిది అని నటులు సౌమిత్, శ్రేయాసి సేన్, శరణ్య ప్రదీప్, గీతా భాస్కర్  చెప్పారు. శేఖర్ కమ్ముల గారి స్టైల్‌‌‌‌లోనే ఈ సినిమా ఉంటుందని  ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ అన్నారు.  మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ కొడగండ్ల,  లిరిసిస్టులు గడ్డం వీరు,  కృష్ణవేణి పాల్గొన్నారు.