వరుణ్ సందేశ్ హీరోగా ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం ‘యద్భావం తద్భవతి’. రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘జినక్ చిక’ అంటూ సాగే పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.శ్రీలేఖ విడుదల చేసి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మిహిరామ్ కంపోజ్ చేసిన పాటకు బట్టు విజయ్ కుమార్ లిరిక్స్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్‌గా పాడాడు.
సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. మాస్ వైబ్‌తో సాగే ఈ పాట పండగలకు, పెళ్ళిలలో, ఫంక్షన్స్‌లో అలాగే కాలేజ్ ఫెస్టివల్స్‌లో ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని మేకర్స్ చెప్పారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని అన్నారు.
