ప్రైమరీ బడుల్లో క్లాసుకో టీచర్ను నియమించాలి ..తపస్ రాష్ట్ర కమిటీ డిమాండ్

ప్రైమరీ బడుల్లో క్లాసుకో టీచర్ను నియమించాలి ..తపస్ రాష్ట్ర కమిటీ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ బలోపేతం కావాలన్నా, విద్యార్థులకు న్యాయం జరగాలన్నా తక్షణమే జీవో నంబర్ 25ను సవరించి, ప్రతి ప్రైమరీ స్కూల్‌‌‌‌లో క్లాసుకు ఒక టీచర్​ను నియమించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) డిమాండ్ చేసింది. ఈమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వొడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య ఒక ప్రకటన రిలీజ్ చేశారు. టీచర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. 10 మందిలోపు విద్యార్థులున్నారనే నెపంతో బడులకు కనీస అవసరాలు నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.