అస్సామీ కంటెంట్ క్రియేటర్ జుగమయ దత్తా కన్నుమూత.. ఇంటికి వెళ్లాలనుకున్న.. ఇంతలోనే విషాదం!

 అస్సామీ కంటెంట్ క్రియేటర్ జుగమయ దత్తా కన్నుమూత.. ఇంటికి వెళ్లాలనుకున్న.. ఇంతలోనే విషాదం!

సోషల్ మీడియాలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ కంటెంట్ క్రియేటర్ జుగమయ దత్తా అకాల మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మరణవార్తతో స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆమెకు నివాళులు అర్పించగా...  ఆమె మరణానికిగల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.

ఇంటికి వెళ్లాలనుకున్న జుగమయ..
అస్సాంలోని టిన్సుకియాలో నివసిస్తున్న జుగమయ దత్తా.. కొద్ది వారాల క్రితమే తన కుటుంబాన్ని కలిసేందుకు ఇంటికి వెళ్లి వచ్చారు. అయితే, మళ్లీ తన ఇంటికి వెళ్లాలని ఆమె కోరుకున్నట్లు కుటుంబ సభ్యురాలు జునాలి బర్మన్ గోగోయ్ వెల్లడించారు.

ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో ద్వారా షేర్ చేసారు. ఇటీవల తన తండ్రి వర్ధంతి సందర్భంగా జుగమయ కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లి వచ్చారని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లాలని ఆమె కోరుకున్న.. తల్లి మాత్రం వెళ్లవద్దని సూచించినట్లు చెప్పారు.

దీనికి విమాన టికెట్ల ధరలు కూడా ఒక కారణమని జునాలి వివరించారు. ప్రస్తుతం విమాన ప్రయాణ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలిపారు.

జుగమయ జీవితంలో ఏం జరిగింది?

జుగమయ ఆకస్మిక మరణంతో ఆమె అభిమానులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమెకు ఏం జరిగింది? మరణానికి కారణమేంటి ? అనే సందేహాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే, జుగమయ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు కూడా తెలియదని కుటుంబికులు  తెలిపారు.

జునాలి మాట్లాడుతూ.. జుగమయ, ఆమె భర్త మధ్య తమకు తెలిసినంత వరకు ఎలాంటి గొడవలు లేవని, ఆమె భర్త కూడా జుగమయను బాగా చూసుకునేవారని, ఆమెకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేవారని చెప్పారు.

ఊహాగానాలు చేయొద్దు.. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
జుగమయ మరణం తర్వాత సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, పూర్తి వివరాలు తెలియకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆమె కుటుంబ సభ్యులు ప్రజలను కోరారు. జుగమయను కానీ, ఆమె భర్తను కానీ విమర్శించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, జుగమయ మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారని తెలిపారు.

పోస్ట్‌మార్టం పూర్తి.. పోలీసుల దర్యాప్తు
జుగమయ మృతదేహానికి రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం, అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మరణానికి గల అసలు కారణం ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చనే పుకార్లు వినిపిస్తున్న.. కుటుంబ సభ్యులు లేదా స్థానిక అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. జుగమయ మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.