ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాల్లో దారుణం జరిగింది. బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్ ను నలుగురు యువకులు చితకబాదారు. జిల్లాలోని తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ దగ్గర జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ దగ్గర ఆర్టీసీ డ్రైవర్ వేమన నాయక్ పై నలుగురు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. బస్సును ఆపకపోవడంతో బైకులపై వెంబడించి వేమన నాయక్ ను కిందికియు దింపి దారుణంగా కొట్టారు యువకులు.
బెంగుళూరు నుంచి కదిరికి వస్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు యువకులు. డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడిపాడని ఆరోపిస్తున్నారు యువకులు. అన్నమయ్య జిల్లా మద్దయ్యగారి పల్లికి చెందిన యువకుడు తన స్నేహితులు, బంధువులతో కలిసి బస్సును వెంబడించి డ్రైవర్ పై దాడికి పాల్పడ్డాడు.
బస్సు ఆపలేదని ఏపీలో ఆర్టీసీ డ్రైవర్ను దారుణంగా కొట్టిన యువకులు బెంగళూరు నుంచి కదిరికి వస్తున్న ఆర్టీసీ బస్సును అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లిలో ఆపాలని చూసిన యువకులు డ్రైవర్ బస్సు ఆపకపోవడంతో బైకులపై వెంబడించి, డ్రైవర్ను కిందకు దింపి దారుణంగా కొట్టిన నిందితులు... https://t.co/VxqbsV4aFw
— Syed Mahaboob Basha (@Smahaboob17) October 29, 2026
కొక్కంటి క్రాస్ దగ్గర బస్సు అడ్డుకొని డ్రైవర్ ను కిందికి దించి చితకబాదారు యువకులు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు డ్రైవర్ వేమన నాయక్. బాధితుడి ఫిర్యాదుతో మేరకు విశ్వనాథ్, మధు కుమార్, సునీల్, రాము లపై క్రిమినల్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు తనకల్లు పోలీసులు.
