రెండు రోజులుగా తిండి, నీరు లేక.. హైవేపై డ్రైవర్ల ఆకలి కేకలు... హౌరా-చెన్నై రహదారిపై లారీలు నిలిపేసిన అధికారులు..!

రెండు రోజులుగా తిండి, నీరు లేక.. హైవేపై డ్రైవర్ల ఆకలి కేకలు... హౌరా-చెన్నై రహదారిపై లారీలు నిలిపేసిన అధికారులు..!

శ్రీకాకుళం జిల్లాలో హైవేపై డ్రైవర్ల ఆకలి కేకలు ఆకాశాన్నంటుతున్నాయి.. బహుదా నది వరద ఉధృతి కారణంగా హౌరా-చెన్నై హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండు రోజులుగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది ఏడుదుర్కొంటున్నారు. కనీసం 48 గంటలుగా తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్లు. మరో పక్క టోల్ గేట్ దగ్గర వాహనదారుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది.

వరద నీరు హైవేపైకి చేరడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో వాహనాలను నిలిపివేశారు. దీంతో రెండు రోజులుగా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కనీస మౌలిక సదుపాయాలు లేక డ్రైవర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

48 గంటలుగా తిండి, నీరు కూడా లేదని..  తమ పరిస్థితిని పట్టించుకునే వారే కరువయ్యారని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరదల కారణంగా వాహనాలను నిలిపివేయడం తప్పనిసరైనా.. రోజుల తరబడి రోడ్డుపైనే చిక్కుకున్న డ్రైవర్లకు ఆహారం, మంచినీరు అందించాల్సిన బాధ్యత ఎవరిదంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.